చేర్యాల కాంగ్రెస్‌లో కొత్త జోష్‌!

12-10-2026 | 03:32pm

చేర్యాల, అక్టోబర్ 12 (విజయక్రాంతి): జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు చేర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతన వార్డు కమిటీల ఎన్నిక నిర్వహించారు.

సోమవారం దాసరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంలో భాగంగా పట్టణంలోని 8వ, 11వ వార్డులకు కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు. 8వ వార్డు అధ్యక్షుడిగా నీలం సునీల్ కుమార్ (సన్నీ), 11వ వార్డు అధ్యక్షుడిగా పచ్చిమడ్ల సత్యనారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పార్టీ అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట డీసీసీ ఉపాధ్యక్షుడు పూర్మ ఆగం రెడ్డి, మండల అధ్యక్షుడు మంజె మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు క్రిష్ణ, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్, మార్కెట్ డైరెక్టర్ పచ్చిమడ్ల వెంకటయ్య, నాయకులు ముస్త్యాల యాదగిరి, అంబాల రాములు గౌడ్, కాటం మల్లేశం, కాటం శ్రీనివాస్, శ్రీరామ్ వెంకటేష్, గుస్క శ్రీనివాస్, గుస్క వాసంతి, ఎండీ జహీరుద్దీన్, ఎండీ హాజీ పాషా, పిల్లి రవి, కొలిపాక వెంకటేష్, బుట్టి యాదగిరి, బుట్టి బిక్షపతి, పాక చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు