కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సన్మానం

09-10-2026 | 12:50pm

బెజ్జంకి: కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్య(Baswa Lakshmi Narsaiah)కు రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి(Development of agricultural sector), రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు