పేద వైశ్యులకు ఉచిత కాశీ తీర్థయాత్ర
ముకరంపుర,(విజయక్రాంతి): పేద వైశ్య కుటుంబాల(Poor Vysya Families)కు పుణ్యక్షేత్రాల సందర్శన అవకాశం కల్పించేందుకు ఈ నెల 25న కరీంనగర్(Karimnagar) నుంచి మూడో విడత ఉచిత కాశీ తీర్థయాత్రను నిర్వహించనున్నట్లు గంప శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కీర్తిశేషులు గంప నారాయణ, అనసూయ పేర్లతో నిర్వహిస్తున్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యాత్రను చేపడుతున్నట్లు వెల్లడించారు.
కేవలం నిరుపేద వైశ్య భక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని, 45 జంటలు మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. యాత్రకు దరఖాస్తు చేసుకున్న అర్హుల నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామని గంప శ్రీనివాస్ తెలిపారు.
ఎనిమిది రోజుల పాటు సాగే ఈ తీర్థయాత్రలో చాందా, మయ్యార్, చిత్రకూట్, అయోధ్య, కాశీ, ప్రయాగ్‌రాజ్, కామాఖ్య దేవాలయాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.ఉచిత కాశీ తీర్థయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9866665526, 9849562254 నంబర్లలో సంప్రదించాలని గంప శ్రీనివాస్ సూచించారు.