సమయపాలన పాటించాలి: కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector Haritha) సూచించారు. శుక్రవారం సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి(Sirpur(T) Government Hospital)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెలివరీలు, ఇన్‌పేషెంట్, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
స్టోర్ రూమ్‌తో పాటు వైద్య పరికరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉండగా, ఒక్కరే హాజరు కావడంపై ఆరా తీశారు. మిగతా వైద్యులు విధులకు ఎందుకు హాజరు కాలేదో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.