జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ చెల్లించాలి

09-10-2026 | 01:30pm

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జూనియర్ డాక్టర్ల(Junior Doctors)కు నెలకు రూ.30 వేల స్టైఫండ్(Stipend ) చెల్లించడంతో పాటు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్(AITUC district secretary Bogge Upender) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు తమ హక్కుల సాధన కోసం చేపట్టిన సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

డాక్టర్లను విభజించి పాలించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి ఉన్నారు.

మరిన్ని వార్తలు