ఓటు హక్కు ఏ పార్టీ సొత్తు కాదు

10-10-2026 | 02:46pm

బెజ్జంకి, అక్టోబర్‌ 10 (విజయక్రాంతి): ఓటు హక్కును హరిస్తే సహించేది లేదని, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించడాన్ని నిలిపివేయాలని ఏఐవైఎఫ్‌ బెజ్జంకి మండల ప్రధాన కార్యదర్శి దొంతరవేణి మహేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం (Petition) సమర్పించారు.

ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అది ఏ రాజకీయ పార్టీ సొత్తు కాదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ (SIR Process)పై వస్తున్న అభ్యంతరాలను నివృత్తి చేసి, ఓటర్ల జాబితాల సవరణలో పారదర్శకత (Transparency) పాటించాలని కోరారు. ఓటర్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపించాలని, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు వడ్లూరి మల్లేశం, పులి రమేష్‌, లింగాల మహేష్‌, శంకర్‌, రావుల రమేష్‌, మధు, నరేష్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు