ఏజెన్సీ పాఠశాలల్లో జీఓ 25 అమలును నిలిపివేయాలి

10-10-2026 | 04:45pm

ఉపాధ్యాయ సంఘం డిమాండ్.. మూడు మండలాల నూతన కమిటీల ఎన్నిక

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని(Agency Scheduled Area) పాఠశాలల్లో ఉపాధ్యాయుల(Teachers) సర్దుబాటు కోసం అమలు చేస్తున్న జీఓ 25ను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ స్టేట్ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్(Telangana State Adivasi Teachers Federation) (టీఎస్ ఏటీఎఫ్) రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసింది. శనివారం ఇల్లెందులో(Illendu) జరిగిన డివిజన్ స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోకాళ్ల శ్రీనివాసరావు, కబ్బాకుల రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు వల్ల ఏజెన్సీ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి నిబంధనలు రూపొందించాలని కోరారు. సమావేశం అనంతరం ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి మండలాల నూతన కమిటీలను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు