లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం
తుంగతుర్తి, (విజయక్రాంతి) : తుంగతుర్తి లైన్స్ క్లబ్(Tungaturthi Lines Club) ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోలవరపు రాములమ్మ జయంతి పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలోని శివాలయం ఎదుట, ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్(International Lions Club) ఆదేశాల మేరకు, అల్పాహార వితరణ కార్యక్రమం ప్రారంభించి, లైన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వర్లు(Gudipudi Venkateswarlu), జోనల్ చైర్మన్ పాలవరపు సరస్వతి సంతోష్ మాట్లాడారు. లైన్స్ క్లబ్ కుటుంబ సభ్యులు తమ పుట్టినరోజు పెళ్లిరోజు తమ తల్లిదండ్రుల యొక్క జయంతి ,వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.
పేదవారికి అన్న దానం చేయడం అద్భుతమని, అన్ని దానాల కెల్లా అన్నదానం గొప్పదని వర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లైన్స్ క్లబ్ అధ్యక్షులు తల్లాడ కేదారి, ప్రధాన కార్యదర్శి గుండ గాని రాము కోశాధికారి ఓరిగంటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్, పులుసు వెంకటనారాయణ గౌడ్ లైన్స్ క్లబ్ కోఆర్డినేటర్లు ఎనగందుల గిరి, ఓరుగంటి సుభాష్, గుండ గాని రాములు గౌడ్, వెంకటేశ్వర్లు గుడిపూడి లక్ష్మణరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.