వెన్నాచేడ్‌లో కాంగ్రెస్ కొత్త టీమ్

10-10-2026 | 04:55pm

మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మండల పరిధిలోని వెన్నాచేడ్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గంగుల పుల్లారెడ్డి సమక్షంలో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది (Election). ఈ ఎన్నికల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంతర్గాని రాములు గౌడ్, ఉపాధ్యక్షుడిగా మైసగళ్ల రాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోడూరు శివ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దర్వాజ రాజేందర్, గ్రామ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మైసగళ్ల చంద్రకళ ఎన్నికయ్యారు (Appointment).

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోయిని గోపాల్, దోమ పులిందర్ రెడ్డి, చిన్నయ్య, బాలయ్య, నర్సింలు గౌడ్, మాసయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు