రైతులకు ఇబ్బందులొద్దు

10-10-2026 | 04:33pm

జనగామ, అక్టోబర్ 10(విజయక్రాంతి): శనివారం జనగామ మండలంలోని షామీర్‌పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్ సందర్శించి ప్రారంభించారు (Inauguration). ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు.

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, పారదర్శకంగా ధాన్యం సేకరించాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో తేమ శాతం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా కేంద్ర నిర్వాహకులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు (Guidelines).ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం, డీటీసీఎస్‌లు, గ్రామ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు