కేసుల దర్యాప్తుపై ఎస్పీ ఫోకస్

10-10-2026 | 04:49pm

నిర్మల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వివిధ కేసులను వేగంగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు, నేరాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు (Crime Investigation). శాంతిభద్రతల పర్యవేక్షణపై మరింత దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు (Law and Order).

మరిన్ని వార్తలు