రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని బాలుడు
సిడబ్ల్యూసికి అప్పగించాం : సీఐ ఇజాజుద్దీన్
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): నగరం లోని రైల్వే స్టేషన్(Railway station) ప్రాంతంలో సుమారు 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని బాలుడు కనిపించినట్లు పట్టణ రెండో పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్(Second Police Station Inspector Ijazuddin) తెలిపారు. బాలుడిని పేరు అడగగా మహేందర్ అలియాస్ మహేష్ అని చెప్పినట్లు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదని, బాలుడు టీషర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.
బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే మహబూబ్‌నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు. బాలుడి వివరాలు తెలిసిన వారు కూడా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బాలుడిని సిడబ్ల్యుసికి అప్పజెప్పినట్లు సిఐ తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
రెండో పట్టణ పోలీస్ స్టేషన్: 8712665202
ఇన్‌స్పెక్టర్: 8712659312
ఎస్‌ఐ: 8712659334, 8712659335