స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
29-09-2026 | 05:37pm
నారాయణఖేడ్, సెప్టెంబర్ 29 : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని రుద్రారం గ్రామపంచాయతీలో మంగళవారం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో 490 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పంపిణీ చేయడం జరిగిందని సర్పంచ్ పూలమ్మ సామెల్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు .
కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వరూప సంగారెడ్డి, స్థానిక డీలర్ జనార్ధన్ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు యాదు,వీరన్న, ఆగామప్ప,డేవిడ్, జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .