జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక

27-10-2026 | 04:27pm

పటాన్ చెరు, అక్టోబర్ 27: జాతీయ స్థాయి అఖిల భారత అంతర్‌ డైరెక్టరేట్ డ్రోన్ పోటీ–2026కు(National-level All-India Inter-Directorate Drone Competition) తెలంగాణ నుంచి ఎంపికైన నలుగురు క్యాడెట్లలో ఇద్దరు గీతం హైదరాబాద్ ఎన్‌సీసీ విద్యార్థులు(NCC students from Hyderabad) చోటు దక్కించుకున్నారు. గీతం క్యాడెట్లు జూనియర్ అండర్ ఆఫీసర్ ఎ. అభినవ్ సాయి కార్తీక్, జూనియర్ అండర్ ఆఫీసర్ తమ్ములూరి కావ్య ఏపీ–తెలంగాణ డైరెక్టరేట్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. తమిళనాడులోని తిరుచెంగోడ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో వీరు పాల్గొంటున్నారు. క్యాడెట్ల విజయంపై గీతం అధికారులు అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు