వాహనాల వేలం రూ. 37,760 ఆదాయం
27-10-2026 | 05:23pm
నిర్మల్ అక్టోబర్ 27 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్(Prohibition and Excise Station) పరిధిలో పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహించగా రూ. 37,760 వేల ఆదాయం సమకూరినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వేముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఐదు మోటార్ సైకిళ్లకు వేలం వేయగా రూ.32 వేలు, జీఎస్టీ రూ.5,760తో కలిపి మొత్తం రూ.37,760 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. బిక్షపతి, ఎస్సై వసంతరావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.