ఇంద్రవెల్లి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయండి
తెలంగాణ రక్షణ సేన చెన్నూరు నియోజకవర్గం ఇంచార్జ్ కేదాసు గిత పిలుపు
కోటపల్లి,( విజయక్రాంతి ): ఈ నెల 30న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను(Panchajanya Resolve Assembly) విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ కేదాసు గీత పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కేంద్రంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు .
సభకు కోటపల్లి మండలం నుంచి సుమారు వెయ్యి మంది రైతులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఇంద్రవెల్లి సభ ఇన్చార్జి మంచి రెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి, మేడి రాజశేఖర్, వడ్లకొండ రాజేష్ ,చిట్యాల నరేష్,ధరావత్ రాజేష్, ఎస్.కె సమీర్,శిరీష, సుమలత తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.