ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి
నవంబర్ 1న ఢిల్లీ మహా ర్యాలీని విజయవంతం చేయాలి
కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): “ఓటు బచావో–దేశ్ బచావో” ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) పిలుపునిచ్చారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ కె.బీ.ఆర్. నాయుడు, టీపీసీసీ సమన్వయకర్త అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్‌రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కె.బీ.ఆర్. నాయుడు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా ప్రతి బూత్‌లో జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, తొలగించిన పేర్లు, తప్పుల వివరాలను సేకరించాలని సూచించారు.
మండల, డివిజన్ స్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశాలు నిర్వహించి, గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులు తెలిపారు. ఇంటింటి పరిశీలన చేపట్టి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట ఫారం-6, ఫారం-8 ద్వారా పేర్ల నమోదు, సవరణలు చేపట్టాలని పేర్కొన్నారు.
నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ఓటు బచావో–దేశ్ బచావో” మహా ర్యాలీకి భూపాలపల్లి జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఏ.కురవి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.