ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
జనగామ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indira Gandhi, India's first female Prime Minister) వర్ధంతి సందర్భంగా ఈ నెల 31న జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేశ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సేవాదళ్ బాధ్యులు మంకాల దాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశభక్తి, ధైర్యం, ప్రజాసేవ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ పేదలకు అండగా నిలవాలని, ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకరి శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కిషన్ నాయక్, ఉదయ్ కుమార్, కిష్టయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.