తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం ముఖ్యం...

27-10-2026 | 05:25pm

మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష... 

ఆదిలాబాద్, అక్టోబర్ 27, (విజయక్రాంతి) : తల్లి, బిడ్డల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు(Municipal Chairperson Bandari Anusha Satish). ఆదిలాబాద్ లోని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కొరకు నిర్వహించిన ‘ఆర్యజనని – ధీరమానవుడిని తయారు చేసే ప్రయత్నం’ కార్యక్రమంలో ఆమె  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు పోషకారంతో కూడిన లడ్డూలను పంపిణీ చేశారు. 

 ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తల్లి ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తుందని, నేటి పిల్లలే రేపటి సమాజానికి మార్గదర్శకులని పేర్కొన్నారు. అదేవిధంగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను తమ సొంత పిల్లలుగా భావిస్తూ ఎంతో ప్రేమతో, బాధ్యతతో సంరక్షిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ, వారి ఆరోగ్యం, ఎదుగుదల పట్ల శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులను,

అంగన్‌వాడీ సిబ్బందిని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని మిల్కా, సీడీపీఓ సౌందర్య, శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు భూమన్న, కోరెడ్డి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు