5 September, 2026 | 11:49 AM

ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడిగా రాజేందర్

05-09-2026 | 11:11am

•ఉపాధ్యక్షుడిగా అర్జున్ ఏకగ్రీవ ఎన్నిక

హత్నూర సెప్టెంబర్ 04: సంగారెడ్డి జిల్లా హత్నూరు(Hathnoor) మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా చందాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ(MPTC) తలారి రాజేందర్, ఉపాధ్యక్షుడిగా చింతల్‌చెరుకు చెందిన అంబటి అర్జున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం దౌల్తాబాద్‌లోని ఎస్‌ఎస్‌ఆర్‌ గార్డెన్‌(SSR Garden)లో నిర్వహించిన సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాజేందర్, అర్జున్ మాట్లాడుతూ కొరివి కృష్ణస్వామి, పండగ సాయన్నలను ఆదర్శంగా తీసుకుని ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ముదిరాజ్ సామాజికవర్గం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించేలా పనిచేస్తామన్నారు. కమిటీ ఏర్పాటుకు సహకరించిన ఆంజనేయులు, కిస్తయ్య, కృష్ణ, వెంకటేశం, నర్సింలు, పండుగ రవికుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు

మరిన్ని వార్తలు