5 September, 2026 | 1:17 PM

నేపాల్‌కు మరో భారీ ముప్పు.. హై అలర్ట్ జారీ

05-09-2026 | 11:44am
  1. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
  2. చౌలాని నదికి కొండచరియలు ఆటంకం
  3. వరద ముప్పుతో అధికారుల్లో ఆందోళన

ఖాట్మండు: ఆకస్మిక వరదల నుంచి కోలుకోకముందే నేపాల్(Nepal)ను మరో ముప్పు కలవరపెడుతోంది. దార్చుల జిల్లాలో(Darchula District) భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండచరియలు(Landslides) చౌలాని నది(Chaulani River) ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. మరింత భారీగా కొండచరియలు పడితే పూర్తిగా నదీ ప్రవాహం నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రవాహం నిలిచిపోతే దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని హెచ్చరించారు. చౌలాని నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నేపాల్ ప్రభుత్వం(Government of Nepal) భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. నేపాల్-భారత్ సరిహద్దుగా(Nepal-India border) ప్రవహించే మహాకాళి నదిలో(Mahakali River) చౌలాని నది కలుస్తోంది. చౌలాని నది ప్రస్తుతం సాధారణంగానే ప్రవహిస్తోందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిస్తే మాత్రం వరద విపత్తు తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 1,344కు చేరినట్లు పోలీసులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు