5 September, 2026 | 1:15 PM

అర్హులైన ప్రతి ఓటు హక్కును కాపాడాలి

05-09-2026 | 11:26am

ఎస్‌ఐఆర్‌–ఫేజ్‌–2పై బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లకు శిక్షణ, సమీక్ష

నర్సాపూర్‌, సెప్టెంబర్‌ 04: అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును కోల్పోకుండా అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) నాయకులు సూచించారు. నర్సాపూర్‌ పట్టణంలోని యాదవ్‌ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఎస్‌ఐఆర్‌(SIR)–ఫేజ్‌–2పై నియోజకవర్గ బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లకు శిక్షణ, సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రతి బూత్‌కు జారీ అయిన నోటీసులు, సంబంధిత ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వెరిఫికేషన్‌(Verification) సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఫారాలను నిబంధనల ప్రకారం ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. బూత్‌ స్థాయి నుంచే సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో మెదక్‌(Medak) జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, నర్సాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుహాసిని రెడ్డి, మెదక్‌ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ జి.వి. వెన్నెల గద్దర్‌, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ అన్వేష్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ లక్ష్మిరాజు యాదవ్‌, బ్లాక్‌, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు