5 September, 2026 | 10:53 AM

జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్.. దారి మళ్లించిన బస్సులు

05-09-2026 | 10:11am

విధులకు ఆలస్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు

బోథ్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి):  44వ నెంబర్ జాతీయ రహదారి(National Highway 44) పైన నేరడిగొండ నుండి ఇచ్చోడ(Neradgonda to Ichchoda) వరకు దాదాపు 7 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు అధికారులు బస్సులను దారి మళ్ళించారు. ఉదయం పూట రోడ్డు ప్రమాదం జరగడంతో పాటుకుప్తి బస్టాండ్ వద్ద వంతెనపైన మరమ్మత్తులు జరుగుతూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వాహనాలను జాతీయ రహదారి పైన ఒకే వైపు నుండి రాకపోకలు కొనసాగరంతో పది రోజులుగా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

శనివారం ఉదయం నుండి ట్రాఫిక్ జామ్ కావడంతో అదిలాబాద్ నుండి నిర్మల్(Nirmal from Adilabad) వైపు వెళ్లే బస్సులను పోలీసు అధికారులు ఇచ్చోడ నుండి బజారత్నూర్ సోనాల మీదుగా జాతీయ రహదారి వైపు మళ్ళించారు. మరోవైపు వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సహితం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. జాతీయ రహదారిపై కొనసాగుతున్న మరమ్మత్తు పనులు నత్త నడకలు సాగుతున్నాయని ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్(MLAs Jadhav Anil) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తపరిచారు. శుక్రవారం మరమ్మత్తులు కొనసాగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించిన మరుసటిరోజే ట్రాఫిక్ జామ్ కావడం తోపాటు రోడ్డు పై ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.

మరిన్ని వార్తలు