డయాగ్నొస్టిక్ సెంటర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

10-10-2026 | 08:56pm

జహీరాబాద్ అక్టోబరు 10. (విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) జహీరాబాద్ జహీరాబాద్ పట్టణంలోని ఒక డయాగ్నొస్టిక్ సెంటర్(Diagnostic Center) పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పట్టణ ఎస్ ఐ లవ కుమార్(SI Lava Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జహీరాబాద్ మండలము(Zaheerabad Mandal) ఉగ్గిల్లి గ్రామానికి చెందిన మేతరి సురేష్ (33) గత నెల 19న ఆయన భార్యను పరీక్షించేందుకుగాను డయాగ్నస్టిక్ సెంటర్ కు తీసుకువచ్చి పలు పరీక్షలు నిర్వహించారు అన్నారు.

పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టులను తీసుకొని వెళ్ళిన మేతరి సురేష్ ఈనెల 9న సాయంత్రం ఐదు గంటలకు డయాగ్నోసిస్ సెంటర్ కు వచ్చి మీరు సక్రమంగా టెస్టులు చేయలేదని తప్పుడు ఆరోపణలు చేస్తూ గొడవకు దిగి డయాగ్నోసిస్ సెంటర్ వారితో డబ్బులు ఇవ్వాలని లేకుంటే సోషల్ మీడియాలో మీ డయాగ్నోస్టిక్ సెంటర్ పై న్యూస్ వైరల్(Viral News) చేస్తానని మీ సెంటర్ను పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ బూతు మాటలు తిట్టారని తెలిపారు.

నా గురించి మీకు తెలియదని నేను పి డి ఎస్ యు విద్యార్థిని ఆర్గనైజేషన్ లీడర్ నని నాపై తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు ఉన్నాయి. మీరు నన్ను ఏమి చేయలేదని ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు తిట్టి డయాగ్నోసిక్ సెంటర్ సిబ్బందిని బూతు మాటలు చిట్టి మీ అంతు చూస్తానని బెదిరించాడని తెలిపారు ఆసుపత్రిలో ఉన్న శానిటైజర్ స్టాండ్ ను తీసుకొని జిరాక్స్, రిసెప్షన్ కౌంటర్ ,కౌంటర్ టేబుల్ , అల్ట్రాసౌండ్ మిషన్, బయోమెట్రిక్ మిషన్, వీల్ చైర్ ,ప్రధాన ద్వారం ను పగలగొట్టారని తెలిపారు.

అంతటితో ఆగకుండా ఫిర్యాదు దారి అయినా మహమ్మద్ మీనాజ్ అతని స్నేహితుడు సలీం ఐరన్ రాడ్ పైప్ తో కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు డయాగ్నోసిస్ సెంటర్ యజమాని మహమ్మద్ మీనాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి మేతరి సురేష్ ను పై కేసు నమోదు చేసి జైలుకు పంపడమైనదని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు