నింగికేగిసిన ఎంగిలి పూల సంబురాలు

10-10-2026 | 11:13pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) అంబరాన్నంటాయి. వాడ వాడలా బతుకమ్మ వేడుకలు సందడిచేశాయి. తీరొక్క పూలను ను సేకరించి బతుకమ్మ ను పేర్చి కూడళ్లలో వేడుకలు జరిపారు. బతుకమ్మ  నృత్యాలతో(Dances) ఆడపడుచులు ఆకట్టుకున్నారు. బతుకమ్మ పండుగ ఎంగిలి పూలతో మొదలవుతాయి. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.

పిల్లలు,పెద్దలు వయసు తారతమ్యం లేకుండా అందరూ ఎంగిలి పూల వేడుకల్లో పాల్గొన్నారు. ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు. ఆయా వార్డుల్లో ఎంగిలి పూల సంబురాల్లో మహిళా ప్రజాప్రతినిధులు(Public representatives) పాల్గొని సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరిన్ని వార్తలు