ఆటో దొంగ అరెస్ట్‌... వాహనం స్వాధీనం

10-10-2026 | 10:50pm

సదాశివపేట,అక్టోబర్ 10: సదాశివపేట పట్టణంలోని(Sadashivapet town) ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జరిగిన ఆటో చోరీ కేసును(Auto rickshaw theft case) పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి చౌహాన్ గోవింద్‌ను(Chauhan Govind) అరెస్ట్ చేసి, చోరీకి గురైన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.సెప్టెంబర్ 29న తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆటో చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందడంతో ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేష్ కేసు నమోదు(Case registered) చేసి దర్యాప్తు చేపట్టారు. శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ జరిపి నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో నిందితుడు సదాశివపేటతో పాటు హైదరాబాద్, వరంగల్, రాచకొండ పరిధుల్లోనూ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ డి.వెంకటేష్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు