సిరికొండలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

10-10-2026 | 11:05pm

సిరికొండ , అక్టోబర్ 10 (విజయక్రాంతి ): సిరికొండ మండల(Sirikonda Mandal) కేంద్రంలోనీ  కామధేను జూనియర్ కళాశాలలో(Kamadhenu Junior College)  తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతికి(Telangana's traditions and culture) ప్రతికైన బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, కళాశాల ప్రాంగణంలో సాంప్రదాయ బతుకమ్మ పాటలతో  విద్యార్థులు నృత్యాలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మను భక్తిశ్రద్ధలతో ఊరికి దగ్గరలో గల చెరువులో  నిమర్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీన్సిపాల్ పుష్పాల లక్ష్మీ నర్సయ్య , అధ్యాపకులు  వాణి, అఖిల, రుచిత, లత, ప్రశాంత్, నరేందర్, సందీప్ మరియు గజానంద్.పాల్గొన్నారు

మరిన్ని వార్తలు