ఈయూ గెలుపు ఆర్టీసీ కార్మికుల చారిత్రక తీర్పు

10-10-2026 | 10:55pm
  1. కార్మిక వ్యతిరేఖ విధానాలపై ఉద్యమిస్తాం
  2. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధమ అజెండా
  3.    6,500 పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం
  4. ఎఐటియుసి రాష్ట్ర నేతలు జమలయ్య, కందుల భాస్కర్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి) : ఆర్టీసీ కార్మికులు(RTC workers) ఇచ్చిన చారిత్రక తీర్పుతో కార్మిక వర్గ ఐక్యత మరోసారి రుజువైందని ఏ ఐ టి ఓ సి రాష్ట్ర నాయకులు కంచర్ల జమలయ్య కందుల భాస్కర్  అన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation) గుర్తింపు సంఘం ఎన్నికల్లో(Recognition Union Election) ఏఐటీయూసీ, సిపిఐ(AITUC, CPI) అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కూటమి 6,500లకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది.

ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం పట్టణంలోని డిపో సెంటర్, బస్టాండ్ సెంటర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు నాయకులు, కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీ, సంబురాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ విజయోత్సవ సభలో సాబీర్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల హక్కులను కాలరాసే ఏ విధానాలనైనా తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ తీర్పు యాజమాన్యాల, పాలకుల కార్మిక వ్యతిరేక పోకడలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. 

 ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ విలీనమే ప్రధాన ప్రధమ అజెండాగా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఎంప్లాయిస్ యూనియన్, సిపిఐ నాయకులు భూక్యా శ్రీనివాస్, జరుపుల ఉపేందర్, విజయ్ కుమార్, వర్మ, రాజేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు