ఊరు,వాడల్లో,మొదలైన బతుకమ్మ సంబురాలు
ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ శోభ..
బతుకమ్మలతో కళకళలాడిన నారీమణులు....
కొత్తగూడెం అక్టోబర్ 10 విజయక్రాంతి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు(Bathukamma celebrations), రామవరంలో ప్రారంభమయ్యాయి. శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో తొలిరోజు వేడుకలు మొదలుకావడంతో ప్రాంతంలో,పండుగ వాతావరణం నెలకొంది. దేవుడిని పూజించడానికి మాత్రమే పూలను వాడే సంప్రదాయంలో,పూలను కూడా పూజించే సంప్రదాయం కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది అని చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు.
తెలంగాణ ఆడపడుచులు ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో(Devotional) పూజించి తంగేడు, గునుగు, బంతి, చామంతి,తదితర ప్రకృతి ప్రసాదించిన,పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి, జానపద పాటలు పాడుతూ, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగతో రామవరం పరిసరాలు సందడిగా మారాయి.
తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను, ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు భక్తి, ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తూ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారితో కలిసి జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు,చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పూల పండుగ ముగియనుంది.