అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేయొద్దు!

01-11-2026 | 10:50pm

ఓటు హక్కును హరించే కుట్రలను సహించేది లేదు

నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, నవంబర్ 1: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) పిలుపునిచ్చారు.

ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సామాన్యుడి బలమైన ఆయుధమని, దాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణే దేశానికి అసలైన బలమని నీలం మధు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు