మునిపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
01-10-2026 | 06:57pm
మునిపల్లి,(విజయక్రాంతి): ముందలి మండల(Mundali Mandal) అక్రిడేషన్ కార్డు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని గురువారం మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల నూతన అధ్యక్షునిగా బండారి లక్ష్మణ్, ఉపాధ్యక్షునిగా ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శిగా థామస్, జాయింట్ సెక్రెటరీగా అబ్దుల్ రహీం, సలహాదారుగా చోటు మియా, ట్రెజరర్ గా తాటిపల్లి మల్లేశం, సబ్బులుగా భుజంగం, ఆంజనేయులు, అహ్మద్, శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.