హారర్ లుక్‌లో విద్యార్థులు.. గీతంలో హాలోవీన్ హంగామా!

31-10-2026 | 02:23pm

పటాన్‌చెరు, అక్టోబర్ 31 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘ది ఫర్గాటెన్ ఫెయిర్ – హాలోవీన్ 2026’ (The Forgotten Fair – Halloween 2026) వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు (Halloween Celebrations).

ఈ సందర్భంగా విద్యార్థులు భయానక వేషధారణలు (Halloween Costumes), వినూత్న అలంకరణలతో సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో సృజనాత్మకత (Creativity), ఐక్యత, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించాయి.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని విద్యార్థులు అభినందించారు.

మరిన్ని వార్తలు