బీరం లక్ష్మారెడ్డికి మంత్రి జూపల్లి నివాళి
18-09-2026 | 02:20pm
కొల్లాపూర్ రూరల్ : సింగోటం మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి (Former MLA Beeram Harshavardhan Reddy)తండ్రి బీరం లక్ష్మారెడ్డి (81) గురువారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) లక్ష్మారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. సింగోటంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.