ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకల(Aadi Srinivas birthday celebrations)ను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కేక్ కట్ చేసి నాయకులతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన ఆది శ్రీనివాస్, వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని తెలిపారు. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల అభివృద్ధి, నేతన్నల సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆకునూరి బాలరాజు, వెలుమల స్వరూప, కౌన్సిలర్లు ఆడెపు చంద్రకళ, కూరపాటి శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు, సేక్ రియాజ్, రాగుల జగన్, వేముల దామోదర్, మంగ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.