పీయూలో పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
18-09-2026 | 02:29pm
పాలమూరు యూనివర్సిటీ : పీయూ మెయిన్ క్యాంపస్‌తో పాటు పరిధిలోని అన్ని పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. ఎన్. చంద్రకిరణ్(Director of Academic Audit Cell Prof. Dr. N. Chandra Kiran) తెలిపారు. టీజీ సీపీగెట్-2026(TG CPGET-2026)లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 17న తొలి దశ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21లోగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. రెండో దశ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం cpget.tgche.ac.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.