రామచంద్రాపురంలో భక్తులకు అన్నదానo ఏర్పాటు
రామచంద్రపురం ఆగస్టు20 : రామచంద్రాపురం డివిజన్ (Ramachandrapuram Division) పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో మయూరి నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెట్టిన వినాయకుడి వద్ధ నాగులపల్లి భరత్ గౌడ్ అధ్వర్యంలో 3 వేల మంది భక్తులకు అన్నదానo ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్, కాలనీ అధ్యక్షులు మాధవ్ రెడ్డి మాట్లాడుతు ప్రతి సంవత్సరం కుల మతాలకు అతిథంగా అందరి సహాయ సహకారాలతో వినాయకుణ్ణి పెట్టుకుంటాం భక్తి శ్రద్ధలతో పూజిస్తాం అని గత 5 సంవత్సరాల నుండి భరత్ గౌడ్ భక్తులకు అన్నదానం చేస్తున్నారు .
కనుక వారికి వారి కుటుంబనికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలు కలిగేలా చూడాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, రాజు గౌడ్, టెంపుల్ కమిటీ చైర్మన్ చక్రవర్తి, రమేష్, కృష్ణ, దేవేందర్ యాదవ్, మహిపాల్ రెడ్డి, సత్యనారాయణ, రాజు, భాస్కర్, మోహన్ రెడ్డి, వెంకట్రం రెడ్డి, వేణుగోపాల్, మాణిక్ రెడ్డి, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.