గుండంలో పడి ఒకరి మృతి
బ్రహ్మేశ్వర ఆలయ సమీపంలోని జలపాత గుండంలో స్నానానికని వెళ్లి అనంత లోకాలకు
కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర్ గ్రామంలోని శివాలయ సమీపంలోని జల పాత గుండంలో స్నానానికని వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు... పార్డి బీ గ్రామానికి చెందిన గుడాల సాయినాథ్ (48) గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయ వేడుకల్లో భాగంగా ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకెళ్లే కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి బ్రహ్మేశ్వర ఆలయానికి వెళ్లారు. అక్కడ ఉత్సవమూర్తులకు జలాభిషేకం అనంతరం భోజనాలు ముగించుకొని కొద్దిసేపట్లో తిరుగు ప్రయాణమవుదామనుకునే సమయంలో సాయినాథ్ మరోసారి జలపాతం గుండంలో స్నానానికని వెళ్లారు.
అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య గుడాల విజయ గుడాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామ అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడి తండ్రి నెల్లూరు క్రితమే మృతి చెందగా కుటుంబం ఇద్దరు పెద్దదిక్కులను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో నలుగురు ఒకేరోజు మృతి చెందిన సంఘటన మరొక ముందే సాయినాథ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.






