సమాజంలో గురువుకి ప్రత్యేక గౌరవం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
సుల్తానాబాద్ లో ఎంఎంపిఎస్ స్కూల్ ను సందర్శించిన జిల్లా జడ్జి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమాజంలో గురువుకి ప్రత్యేక స్థానం ఉందని, గురువులను గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల(District Chief Judge Sunitha Kunchala) అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోకనగర్ ఎంఎంపిఎస్ స్కూల్ ను జిల్లా జడ్జి సునీత కుంచాల సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఉపాధ్యాయుల(Teachers) పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. ప్రైమరీ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చట్టాల గురించి వివరించారు.
ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే న్యాయ సేవ అధికార సంస్థకు తెలిపినట్లైతే ఆ సమస్యలను పరిష్కరించెందుకు తోడ్పడుతామని జిల్లా జడ్జి సునీత తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు జడ్జి లను ఘనంగా సన్మానించారు. జిల్లా జడ్జి వెంట జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ , సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ఆవుల శివకృష్ణ, న్యాయవాది సామల రాజేంద్రప్రసాద్, పోలీస్ సిబ్బంది,ప్రధానోపాధ్యాయులు బి.రమేష్, ఉపాధ్యాయులు స్నేహలత, స్రవంతి, నేహా, విద్యార్థులు పాల్గొన్నారు.






