6 September, 2026 | 12:16 AM

సైబర్ నేరాలపై అవగాహన

05-09-2026 | 09:11pm

తరిగొప్పుల,(విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత(Warangal Police Commissioner Shweta) ఆదేశాల మేరకు తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం(Jagruthi Police Art Group awareness program) నిర్వహించారు. సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్ఐ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు(Child marriages), మహిళలపై వేధింపులు, డ్రగ్స్, రోడ్డు భద్రతపై కళారూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఉంటే డయల్ 112కు, సైబర్ నేరాలకు 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం, కానిస్టేబుల్ కనకరాజు, సర్పంచ్ కొండ్రతార, ఉప సర్పంచ్ మహేష్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు