పీఆర్టీయూ–టీఎస్ గణపురం మండల నూతన కమిటీ ఎన్నిక
గణపురం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): పీఆర్టీయూ–టీఎస్ గణపురం(PRTU-TS Ghanapuram) మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బిల్లా రఘునాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏరుకోలు భాగ్యలక్ష్మి, సహాయ అధ్యక్షుడిగా ఏ.చంద్రు, మహిళా సహాయ అధ్యక్షురాలిగా డి.విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా ఈ.శేఖర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్.జ్యోతి, కార్యదర్శిగా శ్రవణ్, మహిళా కార్యదర్శిగా కే.మౌనిక ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుసునపూ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకురాలిగా గోరికొత్తపల్లి మండల ప్రధాన కార్యదర్శి పి.శిరీష వ్యవహరించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎల్లబోయిన విజయభాస్కర్, కే.శ్రీనివాస్‌రెడ్డి, పాశం బాపు, ఓదెల నరేందర్, దాసరి చంద్రమౌళి, జెన్నే జ్యోత్స్న, చేలుమల్ల శివశంకర్, పోతుగంటి రాజేందర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ సమ్మయ్యతో పాటు సంఘ సభ్యులు సునీత, శైలజ, సుస్మిత, జేలేందర్, అనూష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.