మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు

22-10-2026 | 09:51pm

మునిప‌ల్లి అక్టోబర్ 22 (విజయక్రాంతి )ః మండ‌లంలోని మ‌ల్లారెడ్డిపేట గ్రామంలో  శుక్ర‌వారం బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations)  గ్రామ స‌ర్పంచ్ రాజు ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో  అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

గ్రామస్తులందరూ కలిసికట్టుగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ పాటలతో పండుగ శోభను చాటారు.  ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ‌స్తులు, మ‌హిళలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు