6 September, 2026 | 12:29 PM

ఉద్యమకారుడు పల్లె రవికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

06-09-2026 | 11:18am

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు పల్లె రవి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పల్లె రవి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పల్లె రవితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన పల్లె రవిని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఆయన మృతి తనను ఎంతో బాధించిందని తెలిపారు. పల్లె రవి(Palle Ravi) కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ తో పాటు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, నాయకులు మైత్రి యాదయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు