6 September, 2026 | 12:29 PM

ఏడుల్లా బయ్యారం సంత అధికారమా...? అనధికారమా...?

06-09-2026 | 11:23am
  1. సంత పేరుతో డబ్బులు వసూళ్లు
  2. వసూళ్ల డబ్బులు ఆ ఇద్దరికి వాటాలు
  3. గ్రామపంచాయతీ ఆదాయానికి గండి
  4. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువు
  5. కలెక్టర్ సార్‌ జర స్పందించండి

పినపాక /మణుగూరు, సెప్టెంబర్ 6,( విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చాక గ్రామాలు, ఎంతగానో అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఓటు వేసి ఇందిరమ్మ పాలన తెచ్చుకున్నారు. కానీ గ్రామాలలో కొందరి నాయకులు ఇందిరమ్మ పాలనకు మచ్చ తీసుకువస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. పినపాక మండలంలోని(Pinapaka Mandal) ఏడుల్ల బయ్యారం గ్రామపంచాయతీలో సంత నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశామంటూ గతంలో తెలిపారు. కానీ గత నెలల నుండి ఈ సంత నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లా అధికారుల అనుమతులు లేనట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. సంతకం వచ్చే వ్యాపారుల వద్ద నుండి పంచాయతీ డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ పంచాయతీ అకౌంట్లో మాత్రం నగదు జమ కావట్లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

గ్రామపంచాయతీ వసూలు చేసిన డబ్బులను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఇద్దరు నాయకులు జేబులో వేసుకుంటున్నారని, గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారని, పలువురు సైతం గుసగుసలాడుకుంటున్నారు. ఏడుల్లా బయ్యారం గ్రామంలో మంగళవారం సంత కు అనుమతులు లేకుండా, జిల్లా అధికారులకు సమాచారం లేకుండా నిర్వహిస్తున్నారని, ఇదెక్కడి విడ్డూరం అంటూ ప్రజల గుసగుసలాడుకుంటున్నారు. కనీసం మండల స్థాయి పంచాయతీ అధికారులు(Panchayat officials) కూడా పట్టించుకున్న పాపాన పోలేకుండా పోయింది. పంచాయతీకి వచ్చే నిధులను కూడా ఆ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి ఆ నాయకుల పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు