స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా లా కళాశాలలో 9న
- ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.మానస
ఎల్బీనగర్, అక్టోబర్ 4 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాల(Telangana Social Welfare Residential Women's Law College) అక్టోబర్ 9న స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. చైతన్యపురిలో(Chaitanyapuri) ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో అక్టోబర్ 9న స్పాట్ అడ్మిషన్లు(Spot Admissions) నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో ప్రిన్సిపాల్ డాక్టర్.ఎం.మానస తెలిపారు. లాసెట్ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో అక్టోబర్ 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9603617134 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. మొత్తం 20 సీట్లను మెరిట్ ప్రకారంగా ఎంపిక నిర్వహిస్తామని తెలిపారు.