సామాన్యులతో షాద్‌నగర్ మున్సిపల్ పాలకవర్గం అల్పాహారం
షాద్‌నగర్ సెప్టెంబర్ 17(విజయక్రాంతి): షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో మున్సిపల్ చైర్మన్(Municipal Chairman), వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సాధారణ ప్రజలతో కలిసి ఫుట్‌పాత్(Footpath)పై అల్పాహారం చేస్తూ సందడి చేశారు.పదవుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావివ్వకుండా ప్రజలతో కలిసి సాధారణ వ్యక్తుల్లా అల్పాహారం చేయడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్,వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, కౌన్సిలర్లు పెంటయ్య, మురళీమోహన్, కొప్పున్నూరి ప్రవీణ్, బచ్చలి నరేష్, దిలీప్, శ్రీశైలం గౌడ్ తదితరులు స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు.ప్రజల సమస్యలు,స్థానిక పరిస్థితులపై వారితో మాట్లాడి సరదాగా సమయాన్ని గడిపారు. చిన్న పదవి వస్తేనే పెద్ద హంగామా చేసే రోజుల్లో.. ప్రస్తుత రోజుల్లో చిన్న పదవులు దక్కినా పెద్ద హంగూ ఆర్భాటాలు ప్రదర్శించే నేతలు కనిపిస్తున్న నేపథ్యంలో, మున్సిపల్ పాలకవర్గం ఫుట్‌పాత్‌పై సాధారణ ప్రజలతో కలిసి అల్పాహారం చేయడం ప్రత్యేకంగా నిలిచింది.