మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 03:34pm

మహా ముత్తారం,(విజయక్రాంతి):  తెలంగాణ ప్రజాపాలన విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహా ముత్తారం మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజని పేర్కొన్నారు.

1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిందని, ఆ చారిత్రాత్మక మార్పు వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నేల పోరాటాల నేల, త్యాగాల నేల, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు