పెద్దమల్లారెడ్డిలో ఘనంగా విశ్వకర్మ జయంతి

17-09-2026 | 03:24pm

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkhunur Mandal) పెద్దమల్లారెడ్డి గ్రామంలో విశ్వకర్మ జయంతి వేడుకల(Vishwakarma jayanti celebrations)ను విశ్వబ్రాహ్మణ కుల సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ యువకులు గ్రామంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం(Sri Potuluri Veerabrahmendra Swamy Temple) వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యతను వివరించారు. విశ్వకర్మ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని, యువత సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు