విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
బుద్ధారం పాఠశాల తనిఖీ చేసిన సర్పంచ్ శ్రీలత అశోక్
గణపురం,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బుద్ధారం సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్(Sarpanch srilatha ashok) అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను గురువారం గ్రామ సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు.
విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం(Mid Day Meal Scheme) సక్రమంగా అమలయ్యేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రతిరోజూ విద్యార్థులకు అందించాలని తెలిపారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, భోజనం తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు వారికి పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు.