సహజీవనం..! ప్రియుడిపై యాసిడ్ పోసి చంపిన మహిళ
17-09-2026 | 08:23am
అమరావతి: విజయనగరం జిల్లాలో(Vizianagaram) దారుణం చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ యాసిడ్ పోసి చంపేసింది. గరివిడి మండలం కందిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న జంట మధ్య ఘర్షణే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీను తలపై ఇనుపరాడ్డుతో కొట్టని రాములమ్మ అనంతరం యాసిడ్(Acid) పోసింది. కొన్ని రోజులుగా మహిళ తన భర్తుకు దూరంగా ఉంటుంది.
తన బావ కొడుకు శ్రీనుతో ఆమె సన్నిహితంగా ఉంటుంది. భార్యకు దూరంగా ఉంటున్న శ్రీను రాములమ్మతో సహజీవనం చేస్తున్నాడు. ప్రియుడిని హత్య చేసిన తర్వాత రాములమ్మ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. గమనించిన స్థానికులు రాములమ్మను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాములమ్మ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.