కరెంటు కోతలతో వరి కోతలు కోసేదెలా
విద్యుత్ కోతలను నిరసిస్తూ మెదక్-బొడమట్పల్లి రహదారిపై రైతుల రాస్తారోకో
పాపన్నపేట: అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ మండల పరిధిలోని నార్సింగి సబ్ స్టేషన్(Narsingi Sub Station) ముందు మెదక్-బొడమట్పల్లి ప్రధాన రహదారి(bodmatpally main road)పై గురువారం రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు(Farmers) మాట్లాడుతూ... కరెంటు కోతల వల్ల వరి కోతలు ఎలా కోసుకోవాలని, వరి, వివిధ పంటలకు నీరు అందక ఎండిపోయే దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు.
నిరంతరంగా కరెంటు సరఫరా చేస్తేనే పంటలను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై ఏఈ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యుత్తు అధికారులతో మాట్లాడించడంతో రాస్తారోకోను విరమించారు.